Yendhuko Yesaiah Telugu christian song lyrics – ఎందుకో యేసయ్యా

Deal Score0
Deal Score0

Yendhuko Yesaiah Telugu christian song lyrics – ఎందుకో యేసయ్యా

ఎందుకో యేసయ్యా నాపై నీ కింత ప్రేమ
మిన్ను నీ దిశ మన్ను నా దశ నాపై నీ కింత జాలి
రుచి చూచి ఎరిగితిని నీ కృపయే నా జీవమని –
జుంటి తేనె కంటే తియ్యనైనది నీ ప్రేమ నాకు చాలు యేసయ్యా
మేలిమి బంగరు కంటే విలువైనది నీ కృప నాకు చాలు యేసయ్యా

భూమికి పునాది వేయక మునుపే నన్ను ఏర్పరచినావు
తల్లి గర్భాన నే పడక మునుపే నన్ను నీవెరిగినావు -2
నీ రూపము నాకిచ్చినావు నీ ఊపిరిని పోసినావు -2
మహిమతో ప్రభావముతో మకుటము ధరింపజేసావు
మకుటము ధరింపజేసావు

మరణకరమైన పాప ఊబినుండి పైకి నను లేపినావు
కదలని స్థిరమైన రాతి పునాదిపై జీవితమును నిలిపినావు -2
నీ రక్తము చిందించినావు ప్రాణమునర్పించినావు -2
రక్షణ సువస్త్రమును నాకు ధరింపజేసావు
నాకు ధరింపజేసావు

Mannu Na Dasha song మన్ను నా దశ

    Jeba
        Tamil Christians songs book
        Logo