Yellappudu Ninnu song lyrics – ఎల్లప్పుడూ నిన్ను స్థుతింతును
Yellappudu Ninnu song lyrics – ఎల్లప్పుడూ నిన్ను స్థుతింతును
ఎల్లప్పుడూ నిన్ను స్థుతింతును
యేసయ్యా నిన్నే కీర్తింతును
ఏ స్థితిలో నేనున్ననూ దుఃఖములో పడియున్నను
శరీరము నను బాధించిన నిను నేను స్తుతియింతును
రోగాలు నన్ను విసిగించినా మానక కీర్తింతును
యెహోవా రాఫా నీవేనని స్వస్థత నాకు ఇస్తావని
కష్టాలు నన్ను కృంగదీసిన నిను నేను స్తుతియింతును
నష్టాలు నన్ను వెంటాడినా మానక కీర్తింతును
మంచి దేవుడ నీవేనని మేలైనదే జరిగిస్తావని
సంపన్న స్థితిలో నేనున్నను నిను నేను స్తుతియింతును
దీనస్థితికి నేజారినా మానక కీర్తింతును
పోషించే తండ్రివి నీవేనని సమృద్ధిలోనికి తెస్తావని
నావారిని నేను కోల్పోయిన నిను నేను స్తుతియింతును
వేదన గుండెను గాయపరిచిన మానక కీర్తింతును
గాయపరిచేది నీవేనని నా గాయాలను కడతావని
తంబురతోను తాళముతోను నిను నేను స్తుతియింతును
సితారతోను స్వరమండలముతో మనసార కీర్తింతును
నిజమైన దేవుడ నీవేనని ఘనమైన కార్యము చేస్తావని