Thanisithi Nee Krupalo – తనిసితి నీ కృపలో
Thanisithi Nee Krupalo – తనిసితి నీ కృపలో
Song Lyrics :
పల్లవి : తనిసితి నీ కృపలో… తలపోసితి నీ మేలులు
అనిశము నా హృదిలో… సూచనగా నీ మాటలు
దాల్చితి బాసికములుగా నా కన్నుల నడుమ
నశియించక నే వసియించెద…యేసయ్యా
పూర్ణాత్మతో నిను సేవించెద… మెస్సియ్యా
1. నిలిపితి నాపై నీ కన్నులు తల్లిగర్భాన నేనుండగా
అనుసరించ నీ ఆజ్ఞలు నాకిల గైకొనజేసి రక్షించగా
నేనేరుగని నీ సూచక క్రియలు నాకు తెలిపితివి
నీ బహుబలమున దీవెనలిచ్చి బ్రతికింపజేసితివి
2. ఒంటరి ప్రార్ధన గని ఆలించి ప్రతిఫలమిచ్చితివి
అడుగుకముందే అన్నీ ఎరిగితివి అక్కరలన్నీ తీర్చితివి
ఆవగింజ పాటి విశ్వాసపు శక్తిని తెలియజేసితివి
ప్రేమతో బ్రతకాలని దానౌన్నత్యము నాకు బోధించితివి