Stuthi Aradhana – స్తుతి ఆరాధన నీకే ప్రభు
Stuthi Aradhana – స్తుతి ఆరాధన నీకే ప్రభు
స్తుతి ఆరాధన నీకే ప్రభు
ప్రాదించెదం నీ సన్నిధిలో
ఈ స్థలము నీ మహిమతో నింపుము
నీ చిత్తమే ఇలా నెరవేర్చుము
హల్లె.. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
నూతన దినమిచ్చితివి నీ కరుణతో
కాపాడుచుంటివి నా దుర్గమై
పిలిచినప్పుడు నా తోనుందువు
పడినప్పుడు నన్ను లేవనెత్తెదవు
హల్లె.. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
యేసయ్యా – నా దైవమా
నా విమోచకుడా – సర్వశక్తిమంతుడా
యేసయ్యా – నా దైవమా
నా స్నేహితుడా – నా మంచి కాపరి
లోకంలో నీవంటి వారెవరు లేరు
నీవు తప్ప వేరే ప్రభువెవ్వరూ?
నీ ఎదుట మాత్రమే మోకరింతును
నీవే నా తండ్రి, నీవే నా ప్రభు
హల్లె.. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా