Sthothram stuthi sthothram – స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమ ఘనత

Deal Score0
Deal Score0

Sthothram stuthi sthothram – స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమ ఘనత

స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమ ఘనత నీకే అర్పింతును యేసయ్య (2)
నా కోసం మరణించి తిరిగి లేచిన నీకే నా స్తుతి స్తోత్రము (2) ‘స్తోత్రం ‘

భాద కలుగు సమయములో నాకు తోడై నిలచి
కష్ట నష్టాలలో నాకు నీడై నిలచి (2)
నను దైర్యపరచితివి నా వెంట నిలచితివి (2)
నా కోసం మరణించి తిరిగి లేచిన నీకే నా స్తుతి స్తోత్రము (2) ‘స్తోత్రం ‘

నే చేసిన పాపముకై శిక్ష నీవు పొందితివి
నే చేసిన దోషముకై సిలువలో మరణించితివి (2)
మృత్యుంజయుడై నిలచి మరణాన్నే గెలచితివి (2)
నా కోసం మరణించి తిరిగి లేచిన నీకే నా స్తుతి స్తోత్రము (2) ‘స్తోత్రం’

Jeba
      Tamil Christians songs book
      Logo