ఎవరూ లేరయ్య నే ఒంటరి దాననైయ్య – Evaru Leraya Ne Ontari Dananaih

ఎవరూ లేరయ్య నే ఒంటరి దాననైయ్య – Evaru Leraya Ne Ontari Dananaih

ఎవరూ లేరయ్య నే ఒంటరి దాననైయ్య
అందరూ నాకూ ఉన్నా నే నేవరికి చెందన్నయ్య “2”

ఈ పోరాటం సమసిపోయేది ఎ‌‌న్నడయ్య
నీ సన్నిదిని నేను చేరేది ఎప్పుడయ్య. “2”

అమృతమంటి అమ్మ ప్రేమను నేను పొందలేదు
భర్త యొక్క అనురాగనికైన నోచుకోలేదు “2”

కన్న బిడ్డలే శత్రువులై నను బాదిస్తున్నారు
నా బంధువులే విరోధులై నను వెదిస్తున్నారు “2”

దిక్కు లేని నాపైన దయ చూపుము యేసయ్య “ఎవరూ”

నిందలనింక సహియించి ఓపిక ఇక లేదు
అవమానాలను భరియించే దైర్యము కనరాదు “2”

నా ఉనికే అందరికి ఇలలో భారముగా ఉంది
దుఃఖముతో కంటికి కునుకె కరువైపోయింది
కనికరించి ఇకనైన నా కరమందుకొవయ్య “ఎవరూ”

ఎవరూ లేరయ్య నే ఒంటరి దాననైయ్య Evaru Leraya Ne Ontari Dananaih--Telugu Christian Songs

Leave a Comment Cancel Reply

error: Download our App and copy the Lyrics ! Thanks
Exit mobile version