సిలువలో మరణించిన నాయేసయ్య
నీపై ప్రేమ నాలో ఎక్కడుందయ్యా”2″
నీప్రేమను మరచి లోకంలో తిరుగుచుండగా
నీజాలిని విడచి పాపిగా నేను మారగా “2”
వెతికి రక్షించి నన్ను బ్రతికించవుగా
” సిలువలో. “
1) మా పాపముకై కొరడాలకు చిక్కావుగా
మాకై పరలోకం ఇవ్వాలని
సిలువను మోసావుగా ” 2 “
ఎంత ప్రేమ నీది యేసయ్యా
నా మరణపు ముళ్లను విరిచినాయ్య”2″
నీ సిలువ చెంత వుంచినావయ్యా
” సిలువలో. “
2) మా దోషముకై దోషిగా నీవు మారగా
నాకై తలపై ముళ్ళకిరీటం
ధరియించావుగా “2”
ఈ దొంగకై దొంగల మధ్య వ్రేలాడవయ్యా
నాపై బెంగతో నీ రక్తాన్ని చిందించావయ్యా”2″
లోక పాపముకై కరిగిపోయావయ్యా
” సిలువలో. “