సర్వాధికారివి నీవేనయ్యా – sarvadhikarivi nivenayya
సర్వాధికారివి నీవేనయ్యా – sarvadhikarivi nivenayya
సర్వాధికారివి నీవేనయ్యా
సజీవునిగా నన్ను నిలిపావయ్యా..
అర్హత లేని నా జీవితాన్ని
నీ సాక్షిగా నీకై నిలిపావయ్యా
జీవింతును నీకోసమే – ప్రకటింతును నీ నామమే..
1.అపవాది శోధనలో పడియుండగా
ఆధారమే లేని ఆ ఘడియ లో
అవకాశం ఇమ్మని నే కోరగా
ఆశ్రయమైతివే నా యేసయ్య..
నీ చేతితో నన్ను విడిపించినా..
ఆ గొప్ప ప్రేమను మరువనయ్యా…
ఈ జీవితం నీదేనయ్యా…
నా జీవితం నీ కొరకేన్నయ్యా..
2.అరచేతిలో నన్ను చెక్కావయ్య..
నీ పాద సేవలో నే సాగేదనయ్య..
నీ చిత్తం నెరవేర్చే కృపనియ్యవా..
నీ సేవలో నన్ను స్థిరపరచవా..
వేసారి పోతున్న నీ ప్రజలను…
నీ కొరకు వెలిగించే వరమీయ్యవా..
నీ రాకకై నే వేచానయ్య..
నీ రాజ్యములో నన్ను మరువకయ్యా