Sarirarevvaru Na Priyudaina Yesayyaku song lyrics – సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు

Deal Score+1
Deal Score+1

Sarirarevvaru Na Priyudaina Yesayyaku song lyrics – సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు

సరిరారెవ్వరూ ప్రియుడైన యేసయ్యకు –2
సర్వము నెరిగిన సర్వేశ్వరునికి
సరిహద్దులు లేని పరిశుద్ధునికి –2
సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు –2

  1. నమ్మదగిన వాడే నలుదిశల నెమ్మది కలుగజేయువాడే –2
    నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే
    నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే –2
    సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు –2
  2. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే –2
    ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే
    నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే –2
    సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు –2
  3. పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే –2
    శ్రేష్ఠమైన పునరుత్థాన బలము యిచ్చినాడే
    నాకై అతిత్వరలో మహిమతో రానైయున్నావాడే –2
    సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు –2

సర్వము నెరిగిన సర్వేశ్వరునికి
సరిహద్దులు లేని పరిశుద్ధునికి –2
సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు –2

Jeba
      Tamil Christians songs book
      Logo