Saranamu Neeve Yesayya – శరణము నీవే యేసయ్య
Saranamu Neeve Yesayya – శరణము నీవే యేసయ్య
శరణము నీవే యేసయ్య నా ఆధారమైనావయ్యా..
పరిశుద్ధుడవు నీవయ్యా నను నీ వలె మార్చావయ్యా..
స్తుతియాగము నీకే అర్పింతును
కృపలోనే నిత్యము జీవింతును..
ఆధారం కృపయే..
ఆనందం నీలోనే..
అతిశయం నీ కృపయే..
ఆశ్రయం నీలోనే…
- కరుణామూర్తిగా దిగివచ్చిన..
కరములు చాపి కరుణించిన..
కలుషము బాపి నను మార్చిన
కనికరించిన నీ కృప..
నీ కృపలోనే..ఆ..
నీ కృపలోనే నాకు క్షేమము
నీ కృపయే నా ఆధారము..
ఆ కృపలోనే నన్ను నడిపించవా… - నిజ స్నేహితుడవు నీవేనయ్యా..
నను ప్రేమించిన సాత్వీకుడా..
నిరతము నన్ను ఎడబాయక
నడిపించినదీ నీవేనయ్యా..
మార్గము నీవే…ఆ…
మార్గము నీవే సత్యము నీవే
మరణము గెలిచిన జయశీలుడా…
మమ్ము కొనిపోగా రానున్న మహనీయుడా.