రారోరి పెద్దన్న యేసయ్య పుట్టినాడు –
సూడగ ఎళ్ళొద్దాము
రారోరి సిన్నన్న యేసయ్య పుట్టినాడు –
సూడగ ఎళ్ళొద్దాము
బెత్లహేము పురములోన – బాల యేసుడై
పొత్తి గుడ్డలతో – సుట్టబడియున్నాడు
మన జీవితాలలో – వెలుగు ని౦ప వచ్చాడు
॥రారోరి పెద్దన్న॥
1) ఈ సృష్టి అ౦తటిని – నోటి మాటతో సేసి
దీనుడిగా ఇల పుట్టినాడు ॥2॥
మన పాప బతుకుల్లో – పాపాన్ని తొలగింప
యేసయ్యగా భువికొచ్చినాడు॥2॥
చి౦తలేదు మనకిక – యేసు పుట్టెను
పాపభీతి మననుండి – దూరమాయెను
ఆనందమానందమే – యేసుని జననమే
సర్వ లోకాల – ప్రజలకిక ఆనందమే
॥రారోరి పెద్దన్న॥
2) జీవమునిచ్చుటకు – ప్రేమను సూపుటకు
స్వర్గసీమను వీడి వచ్చినాడు॥2॥
దావీదు వ౦శమ౦దు -ధన్యుడు పుట్టినాడు
ఆయనే మన ప్రభు యేసుక్రీస్తు॥2॥
నమ్మిన వారందరికి – నెమ్మదివ్వగా
కృ౦గిన వారందరినీ – లేవనెత్తగా
పశువుల పాకయ౦దు – పవళి౦చిన
మన యేసు సామిని – సూసి తరి౦చుదాము ర౦డి
॥రారోరి పెద్దన్న॥