Paadana Yesuke song lyrics – పాడనా యేసుకే
Paadana Yesuke song lyrics – పాడనా యేసుకే
పాడనా…. యేసుకే…
నేనొక కొత్త కీర్తన
పాడనా… నా యేసుకే….
నూతన సంకీర్తన
జీవము నిచ్చిన జీవాధిపతిని
స్తుతిచేసి నే పాడనా….
తన రూపు నిచ్చిన అతి సుందరుని
వర్ణించి వివరించనా
1.సృష్టికి మూలం నా యేసేనని
స్వరమెత్తి నే చాటనా
సర్వముపైని సార్వభౌముడు
క్రీస్తని కొనియాడనా
మన్నును నన్నుగా మార్చిన మహనీయుని
మహిమను వివరించనా
2.ప్రేమకు ప్రతిరూపం నా ప్రాణ ప్రియుడని
ప్రియముగా కీర్తించనా
నాకై పరమును వీడిన వరమును
విడువక ధ్యానించనా
పాపిని తాకిన పరిశుద్ధ ప్రభువును
ప్రజలలో ప్రకటించనా – పాడనా