otikundanu nenu – ఓటికుండను నేను
otikundanu nenu – ఓటికుండను నేను
ఓటి కుండను నేను నను ఓదార్చుము
ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము
అలుసైనాను అందరికి – నలుసైనాను నా వారికీ
గడిచిపోవునా నా గతి
మారిపోవునా నా స్తితి
- తలరాత ఇంతేనని తల్లడిల్లగా
తన చేయి నను నడిపే మెల్ల మెల్లగా
తనగాయము నాకోసమే కదా
ఈ కాయము యేసు కోసమే సదా - ప్రేమించని వారిపైన ప్రేమ చూపగా
ప్రేమించిన నీ మనసునే గాయ పరచగా
కనురెప్పైనా నను కాయకుండిన
కన్న తండ్రివి సను విడువకుంటివే
౩. మీ లాగా నను ఎవరు ప్రేమించ గలరు
మీ లాగా నను ఎవరు ఆదరించ గలరు
ఈ లోకమే ఏకమై నిలిచినా
నా పక్షమై నీవుంటే చాలయ్య