Nuvvivvakunte Edi Ledaya song lyrics – నువ్వివ్వకుంటే ఏదీ లేదయా
Nuvvivvakunte Edi Ledaya song lyrics – నువ్వివ్వకుంటే ఏదీ లేదయా
నువ్వివ్వకుంటే ఏదీ లేదయా నీకృప లేనిదే ఏదీ రాదయా l2ll
నా ప్రాణము నా జీవము నా సర్వము నా సమస్తము ll2ll
అంతయు నీదే యేసయ్యా స్తుతి చెల్లింతు నేనయ్యా ll2ll
నేను కలిగిన రూపము నేను కలిగిన ఊపిరి
నేను కలిగిన ఈ స్థితి నేను కలిగిన ధన్యత ll2ll
నా ధనము ఘనము జ్ఞానం బుద్ధి నీదే యేసయ్యా
స్తుతియు మహిమ ఘనతా స్తోత్రం నీకే మెస్సయ్యా ll2ll
నేను పొందిన రక్షణ నేను పొందిన స్వస్థత
నేను పొందిన విడుదల నేను పొందిన విజయం ll2ll
నా బలము ధ్వజము కొండ కోట నీవే యేసయ్యా
స్తుతియు మహిమ ఘనతా స్తోత్రం నీకే మెస్సయ్యా ll2ll