Ninne Sthuthisthanayya Telugu Christian Song lyrics – నా జీవితములో నీవు చేసిన
Ninne Sthuthisthanayya Telugu Christian Song lyrics – నా జీవితములో నీవు చేసిన
పల్లవి :
నా జీవితములో నీవు చేసిన
మేళ్లకు నిన్నే స్తుతిస్తానయ్యా
నా జీవితములో నీవు చూపిన
ప్రేమకు నిన్నే స్తుతిస్తానయ్యా
ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలనయ్య
జీవితాంతం స్తుతిస్తానయ్యా
యేసయ్యా యేసయ్యా నిన్నే స్తుతిస్తానయ్యా
1.నే బాధలో వున్నప్పుడు నన్ను లేవనెత్తావయ్యా
కన్నీరు తుడిచావు నన్ను కరుణించావయ్యా
నన్ను ప్రేమించివు నాకై ప్రాణం పెట్టావు
ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలనయ్య
జీవితాంతం స్తుతిస్తానయ్యా || యేసయ్యా ||
2.నే కృంగిన వేళలలో నీ కృపతో నింపావయ్యా
నా పాపం క్షమియించి నన్ను రక్షించావయ్యా
నన్ను బ్రతికించావు నాకై మరణించావు
ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలనయ్య
జీవితాంతం స్తుతిస్తానయ్యా || యేసయ్యా ||