Ninne Nammukunnanaya song lyrics – నిన్నే నమ్ముకున్నానయ్యా
Deal Score0
Shop Now: Bible, songs & etc
Ninne Nammukunnanaya song lyrics – నిన్నే నమ్ముకున్నానయ్యా
నిన్నే నమ్ముకున్నానయ్యా
నా చేయి పట్టి నడుపు
నీవుంటే నాకు చాలు - నీ ప్రేమే నాకు చాలు
1. లోకాన్ని నే ప్రేమించాను. స్నేహితులను నే నమ్మాను
బంధువులే నా బలమైయున్న నావారే అని అనుకున్నాను
అందరు నన్ను వెలిగా చూసి అపహసించి హింసించిరి
నీ ఆలోచనే మరువలేదు నీ కృపయే నను విడువలేదు
2. ధీన స్థితిలో నేనున్నప్పుడు నా పక్షమై నీవు నిలిచావు
కన్నీటి గాధలో నేనున్నప్పుడు నీ వాశ్చల్యమతో నన్ను ఆదరించావు
సీయోనులో నుండి నీ జీవధారలు నాపై ప్రోక్షించి నన్ను దీవించావు
నీ పిలుపే నన్ను విడువలేదు నీ కృపయే నన్ను దాటిపోలేదు