Nija Devuni Prema – నిజ దేవుని ప్రేమ
Nija Devuni Prema – నిజ దేవుని ప్రేమ
నిజమైన దేవుడు తన ప్రేమ చూపుటకై నా కోసమే దిగివచ్చెను తన రూపము నాకిచ్చెను నా పాపమున్ కలువరిలో మోసెను
ప్రేమాపూర్ణుడూ సత్యవంతుడూ ధవళవర్ణుడు అతికాంక్షనీయిడూ
చరణం 1 :
ఒంటరినై నేనుండగా దేవుడు నను దృష్టించి నా చెంత చేరి నన్నాదరించి తన సొత్తుగా మార్చెను
తేజోమయుడూ నీతిసూర్యుడూ రత్నావర్ణుడూ వాత్సల్యపూర్ణుడూ
చరణం 2 :
గమ్యమెరుగక నేనుండగా దేవుడే నా మార్గమై నా చెయ్యి పట్టి నా వెన్ను తట్టి నా స్థితినే మార్చెను.నిష్కళంకుడూ ఆత్మరూపుడూ పూజ్యనీయుడూ దీర్ఘశాంతుడూ
చరణం 3 :
నా దేవుని పనిలో నేనుండగా నాకై త్వరలో వచ్చును దుఃఖములేని ఆ రాజ్యములో తన కౌగిలిలో ఉందును.
స్తుతికి పాత్రుడూ నా ప్రాణా ప్రియుడూ మహిమాన్వితుడూ సర్వశక్తిమంతుడూ