Ni Prema Pandhirilo song lyrics – నీ ప్రేమ పందిరిలో
Ni Prema Pandhirilo song lyrics – నీ ప్రేమ పందిరిలో
శాశ్వతమైనది నీ ప్రేమ నా యెడల – విడదీయలేనిది నీ స్నేహబంధము
నీ ప్రేమ పందిరిలో ఫలియింపజేసితివే నీ దివ్య సన్నిధిలో ఎనలేని సంతోషమే నీవే తోడుండగా – ప్రతి విజయం నా సొంతమే నీవే దీవించగా – మార్చతరమా ఏదైననూ (మార్చగలరా ఎవరైననూ)
1: వర్ణకందని నీ ప్రేమ ఓదార్చెనయ్యా వేదనలో లోకప్రేమలు నీదు ప్రేమకు సాటిరావుగా స్వార్ధమయ్యా ఈ లోకమే – దాటివెళ్ళకు నన్నెన్నడూ చాలునయ్యా నీ కృప నాకు నన్ను నడుపుము నీ దయతో నీవే నాకుండగా – ప్రతి క్షణము పరవశమే నీవే దర్శించగా – ధన్యమయ్యా నా జీవితం ॥శాశ్వతమైనది||
2: కలవరమొందిన వేళలలో నీ ఉన్నతమైన వాక్యముతో తలను వంచని తెగువ నాలో కలుగజేసినావు మేలు కొరకే శోధనలన్నీ – అనుమతించిన నా తండ్రివే ఘనత కొరకే గాయములన్నీ- అనుభవింపగా తలచితివే నీవే నడిపించగా – ప్రతి దినము ఆనందమే నీవే కరుణించగా- కలతలైనా కమనీయమే ॥శాశ్వతమైనది|
3: ప్రాకారముగా కాచితివే ప్రతి చోట సాక్షిగా నిలిపితివే ఎన్నడెరుగని విజయ బాటలో నన్ను నడిపితివే నీ సువార్తనే నా ప్రాణముగా- ఎంచుకొనుటే నా భాగ్యము నీదు సేవలో అంతము వరకు – తేజరిల్లుటే నా ధ్యేయము నిన్నే సేవింతును – నీ కృపలో హర్షింతును నిన్నే ఘనపరతును – నీ మహిమకై జీవింతును. ॥ శాశ్వతమైనది||