Neevuleni Kshamaina Lyrics

నీవు లేని క్షణమైనా వూహించలేను,
నీ కృప లేనిదే నేను బ్రతుకలేను

నీవే నా కాపరి, నీవే నా వూపిరి, నీవే నా సర్వము యేసయ్య
నీతోనే జీవితం, నేనే నీకంకితం, గైకొనుమ నన్ను, ఓ దేవా…
నీవు లేని క్షణమైనా వూహించలేను,
నీ కృప లేనిదే నేను బ్రతుకలేను ||2||


శ్రమలెన్నో వచ్చిన, శోధనలే బిగిసిన, నన్ను ధైర్య పరిచే నీ వాక్యం,
సంద్రాలే పొంగిన, అల్లలే ఎగసిన, ననుమునగా నీయ్యక లేవనెత్తిన
నీవే నా కండగా, నాతో నీవుండగా, భయమన్నదే నాకు లేదూ,
సర్వలోక నాధుడా, కాపాడే దేవుడా, వందనము నీకే, ఓ దేవా.

శత్రువులే లేచినా, అగ్ని ఆవరించినా, అవి నన్ను కాల్చ జాలవుగా
దుష్టులే వచ్చినా, సింహాలై గర్జించినా, నాకేమాత్రం హాని చేయవుగా
వెన్నుతట్టి బలపరచినా, చేయిపట్టి నడిపించినా, వేదనలే తొలగించినా, యేసయ్యా
సర్వలోక నాధుడా, కాపాడే దేవుడా, వందనము నీకే, ఓ దేవా..

We will be happy to hear your thoughts

      Leave a reply