నీవే నా ఆలాపన – Neeve Na Aalapana Telugu Christian Songs lyrics
నీవే నా ఆలాపన – Neeve Na Aalapana Telugu Christian Songs lyrics
నీవే నీవే నా ఆలాపన
నీకే నీకే నా ఆరాధన “2”
యేసయ్య నిన్నేనే ఆరాధింతున్ మెసయ్య నిన్నేనే ప్రేమించెదన్ “2” ” నీవే”
నీ వాక్కుని పదముగా రాసి
నీ ప్రార్థనె పల్లవి చేసి “2”
నీ స్తుతిలే సప్త స్వరాలై
నీ ప్రేమే కీర్తన కాగా….”2″ “యేసయ్య “
నీ మమతల మధురిమలోనా
నీ పాటల పదనిసలోన “2”
నీ ప్రేమ జల్లులలోన నే నిత్యం నిలిచిపోనా “2” యేసయ్య “
నీ అడుగులో అడుగై రానా
నీ ఒడిలో నిద్దుర పోనా “2”
నన్ను కంటికి రెప్పలా కాచే నా దైవం నీవే కాగా. “యేసయ్య “
telugu catholic songs lyrics