Nee Praana Thyaagam Telugu Good Friday Song lyrics – నీ ప్రాణ త్యాగం
Nee Praana Thyaagam Telugu Good Friday Song lyrics – నీ ప్రాణ త్యాగం
ప : నీ ప్రాణత్యాగం తలపోయుచునే
కమ్మని గీతం నే పాడనా 2
నీ ప్రేమ చూడ ఆశ్చర్యమాయె 2
- క్రూరాత్ముల చేతులలో ఈ క్రూరునికై
ఘోరమైన కొరడాలను భరియించితివే 2
నా నేరము దాచుటకై నేరస్తునిగా
ధీరుడవై నిలిచావు మరణమునొంద 2 - కాళ్ళు చేతులందు ప్రక్క గాయములే కల్గగ
బాధనంత ఓర్చుకొని మౌనివైతివే 2
జీవకిరీటమును నాకిచ్చుటకై
ముండ్లకిరీటమును ధరియించితివి 2
3 . పంచగాయములచే పలు బాధనొంది
కురూపిగా మారిన నీతి రూపుడా 2
వింతైన ప్రేమను ప్రాణాంతము వరకు
ప్రకటించెద నిన్ను ప్రస్తుతించెద 2