Nee Krupaye Naku Adharam song lyrics – నీ కృపయే నాకు ఆధారము

Deal Score0
Deal Score0

Nee Krupaye Naku Adharam song lyrics – నీ కృపయే నాకు ఆధారము

నీ కృపయే నాకు ఆధారం యేసయ్యా
నీ కృపయే నాకు ఆశ్రయము యేసయ్యా
నీ కృపయే నాకు ఆదరణ యేసయ్యా
నీ కృపయే నాకు అతిశయము యేసయ్యా ||2||
యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా ||2||

పనికిరాని రాయినినేను మూల రాయిగ నిలిపితివి
యోగ్యతలేని పాత్రను నేను దీవెనపాత్రగ మలచితివి ||2||
నీ ప్రాణమిచ్చి నను రక్షించి పరిశుద్ధత నాకొసగితివి ||2||
నీ వరములతో నింపితితివి నీ సేవలో నను నిలిపితివి ||2||
యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా ||2||

కృపవెంబడి కృప చూపితివి మేలులు ఎన్నో ఒసగితివి
కంటికిరెప్పలా కాచితివి నీ కృపలో నను దాచితివి ||2||
నీ ప్రేమ చూపి నను దీవించి సంతృప్తిని నాకొసగితివి ||2||
నీ వరములతో నింపితితివి నీ సేవలో నను నిలిపితివి ||2||
యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా ||2||

    Jeba
        Tamil Christians songs book
        Logo