Nee Arachethilo Ee Anadha – నీ అరచేతిలో నేనున్నాని తెలిసి
Nee Arachethilo Ee Anadha – నీ అరచేతిలో నేనున్నాని తెలిసి
నీ అరచేతిలో నేనున్నాని తెలిసి
అనాధ ని మరిచిపోతినే
నీ కను చూపులో నేనున్నాని తెలిసి
కన్నీళ్ళు ఆగకున్నదే
మరణపు అంచులో మరువని దేవా – శరణపు నీడలో దాచిన దేవా
- తోడుగా ఉన్నవారే నన్ను మోడుగా చేసేరు
అండగా ఉన్నవారే నన్ను దండగేనన్నారు
తోడుగా నీడగా నా వెంట ఉంటివే (2)
పాడైన బ్రతుకుని ఫలియింప జేస్తివే
మరణపు అంచులో మరువని దేవా శరణపు నీడలో దాచిన దేవా
- చెంతగా ఉన్నవారే నన్ను చెడుగా చూసేరు
సొంతమన్న వారే నన్ను గుంతలో తోసారు
వింతగా ప్రేమించి ఉన్నతం ఎక్కించి
దారిద్య్ర బ్రతుకునే దీవింప జేస్తివే
మరణపు అంచులో మరువని దేవా శరణపు నీడలో దాచిన దేవా
- కారణమూ నేనేగా – ఇల నమ్మడం తప్పెగా
దారుణం జరిగాక నేను మరణమే కోరగా
కొడుకా కూతురా తండ్రి నే ఉన్నానని
తన ప్రేమ కోగిలిలో కాచుకుంటివే
మరణపు అంచులో మరువని దేవా శరణపు నీడలో దాచిన దేవా