Naa Kosamega Ee Thyagamu song lyrics – నాకోసమేగా ఈ త్యాగము
Naa Kosamega Ee Thyagamu song lyrics – నాకోసమేగా ఈ త్యాగము
నాకోసమేగా ఈ త్యాగము
నాకోసమేగా ఈ యాగము ll2ll
యేసయ్యా.. యేసయ్యా…యేసయ్యా.. నా యేసయ్యా ll2ll
నీ ఆజ్ఞ మీరి ద్రోహినైతిని – పాప శాపముతో కృంగితిని ll2ll
సిలువను ధరియించి శ్రమలను భరియించి
మోసితివా నా పాపభారము ll2ll
మోసితివా నా పాపభారము
పలుమార్లు నేను పడిపోతిని
పతితుడనై తిరిగితిని ll2ll
సిలువలో మరణించి రక్తము చింధించి
కడిగితివా నా మాలిన్యము ll2ll
కడిగితివా నా మాలిన్యము