నా ప్రతి అడుగు నీ దయలో సాగెనే – Na Prathi Adugu
నా ప్రతి అడుగు నీ దయలో సాగెనే – Na Prathi Adugu Telugu Christian Song lyrics, Written tune and sung by Dr. M. K. Sandeep, Calvary Echoes
నా.. ప్రతి అడుగు నీ దయలో సాగెనే
నీ.. ప్రేమతో నా హృదయం పొంగెనే
ప్రతి క్షణం నీ వాక్యమే
నన్ను బలపరచు ఆహారము
నిరంతరం నీ సన్నిధే
నాకు సంపూర్ణ ఆనందము
యేసయ్యా నా దేవా
నను నడిపే నాయకుడా (2)
1వ పల్లవి / VERSE 1
చీకటిలో వెలుగైనావు
చేయ్యి పట్టి నన్ను నడిపించావు
నా అడుగులనే స్థిరపరచావు
నీ వాగ్దానం నెరవేర్చావు
దారి తొలిగి వీడి పోయిన
ద్వారమునే నిలిచి వేచావూ
దూరమునే చూచి పరుగెత్తుకొని వచ్చి
హత్తుకొనీ ముద్దాడావూ
నా తండ్రి, నా నాధా, ప్రేమించే, పోషకుడా (2) (నా.. ప్రతి)
2వ పల్లవి / VERSE 2
పరమును వీడి అరుదెంచావు
తండ్రి చిత్తమే నెరవేర్చావు
నీ ప్రాణమునే వేలగా చెల్లించావు
నా ప్రాణమునే విమోచించావు
నా పాపమునే భరియించావు
శిలువలొ నీ రక్తము చిందించావు
మరణమునే గెలిచి మృత్యుంజయుడై లేచి
జీవమునె నాకిచ్చావు
రక్షకుడా, ఆశ్రయుడా, ప్రాణం పెట్టిన, స్నేహితుడా(2) (నా.. ప్రతి)
Key Takeaways
- The article features the lyrics of the Telugu Christian song ‘నా ప్రతి అడుగు నీ దయలో సాగెనే’ sung by Dr. M. K. Sandeep.
- It expresses themes of divine love, guidance, and the joy of being in God’s presence.
- The verses highlight God’s role as a light in darkness and a source of sustenance and stability.
- The song emphasizes faith in God’s promises and His sacrifice for humanity.
- Additional links to similar Telugu Christian songs are provided at the end.