na hrudhilo marumroge song lyrics – నా హృదిలో మారుమ్రోగే యేసయ్యా

Deal Score0
Deal Score0

na hrudhilo marumroge song lyrics – నా హృదిలో మారుమ్రోగే యేసయ్యా

నా హృదిలో మారుమ్రోగే యేసయ్యా నీ నామం
నా మదిఅంతా సందడి చేసే తరగని ఆనందం
ఏ స్నేహము సాటిరాని నీ చెలిమే నా భాగ్యం
నీ జీవపు వెలుగులో నేను సాగెద ప్రతినిత్యం

అ:ప కవి కలముకు అందని ప్రేమ రవి కాంతిని మించిన తేజం
చవిచూడగ దొరకని బంధం లోక రక్షణ కొరకై త్యాగం

1.మకరందము మించిన మధురం నీ మాటే మహిమకు పయనం
సిరిసంపద మించిన సౌఖ్యం నీవు నాతో ఉంటే సఖ్యం
ఏ శోధన హరించలేని ఆనందమే నా సొంతం
మరణమే జయించలేని నిత్యజీవమే నా సొంతం

2.నీ మార్గమే ఇలలో రాజసం అది ఊహకు అందని పరవశం
నిను పోలిన రూపమే సుందరం ఆ జీవితమంతా పరిమళం
వివరించలేను నీ బంధం ఏ ప్రేయసి కందని తరుణం
సువ్వాసన కలిగిన నీ చరితం నా నోటే స్తుతిగీతం

3.సర్వసృష్టికి నీవే ఆధారం నీయందే దొరుకును పరిహారం
జీవితమంతా నవనూతనం నిను కలిగిన వారికే ఇది సాధ్యం
వర్ణించలేను నీ కార్యం ప్రతి కన్నులకిదియే ఆశ్చర్యం
తలపోసినా తరగని భాష్యం ఇది భాషకు మించిన భావం

    Jeba
        Tamil Christians songs book
        Logo