మన పాలకుడాయనే – Mana Paalakudaayane
Deal Score0
Shop Now: Bible, songs & etc
మన పాలకుడాయనే – Mana Paalakudaayane
పల్లవి : మన పాలకుడాయనే – మన పోషకుడాయనే
నాట్యముతో పాటలతో – స్తుతిగానము చేయుదము
యేసయ్యా – నీవే వెలుగువయ్యా
యేసయ్యా – నిన్నే వెంబడించెదమయ్యా
- మధురమైన మన్నాతో తృప్తిపరచితివి
జీవజలముతో సేదతీర్చితివి
ఎన్నెన్నో మేలులు చేసితివి నీ రెక్కలపై మోసితివి
సంతసముతో కీర్తనలతో నిన్నే పొగడెదము
యేసయ్యా నీవే మా రాజువయ్యా
యేసయ్యా నీవే మా ఆధారమయ్యా ||మన|| - మార్గము నీవే సత్యము నీవే జీవము నీవైతివే
పరము చేరుటకు దారిని చూపుటకు వాక్యపు వెలుగైతివి
ఆ వెలుగులో నే నడుచు విధమును తెలియపరచితివి
ఆత్మ స్వరూపిగ నీ వాక్యాలతో ధైర్యపరచితివి
యేసయ్యా నీవే మా ఆశ్రయమయ్యా
యేసయ్యా నీవే మా సర్వస్వమయ్యా ||మన|| - పలు విధములుగా ప్రేమతో పిలచి నన్ను ఓదార్చితివి
నీ యోగ్యమైన పాత్రగ నన్ను మలచుచుంటివి
ఆనంద తెలంతో అభిషేకించి నన్నే మార్చితివి
అనుక్షణం నను కనిపెట్టుచు కాపాడుచుంటివి
యేసయ్యా ఆలోచన కర్తవయ్యా
యేసయ్యా అల్ఫా ఒమేగవయ్యా ॥మన॥