maatallo cheppalenidi – మాటల్లో చెప్పలేనిది
maatallo cheppalenidi – మాటల్లో చెప్పలేనిది
మాటల్లో చెప్పలేనిది చేతల్లో చూపలేనిది
యేసు నీ ప్రేమా యేసు నీ ప్రేమా
ఎందువెతకినా నాకు దొరకనిది
ఎంతని వర్ణింపజాలనిది
అంధకారమంతా కమ్మినా నీ కృప నను వీడలేదు
అయినవారు అంతా విడిచినా ఆప్తుడవై నిలిచావు
అపనిందల పాలైనా ఆదుకున్నావు
అందలమెక్కించి అక్కున చేర్చుకున్నావు
ఆశలన్ని ఆవిరై పోయినా ధైర్యముతో నింపినావు
అంతులేని ఆనందాలతో ఆశీర్వదించి నడిపావు
ఆత్మీయతలో నడిచే బలము నిచ్చినావు
అభిషేకముతో నన్ను దీవించినావు