Lokanni Preminchey Premikudu – లోకాన్ని ప్రేమించే ప్రేమికుడు
Lokanni Preminchey Premikudu – లోకాన్ని ప్రేమించే ప్రేమికుడు
పల్లవి : లోకాన్ని ప్రేమించే ప్రేమికుడు దివినుండి దిగివచ్చాడు
పాపాన్ని పారద్రోలే పరిశుద్ధుడు పరమాత్ముడైన దేవుడు (2)
ఆదియందు ఉన్న దేవుడు వాక్యమైన సత్య దేవుడు (2)
కృపాసత్య సంపూర్ణుడై శరీరధారియై (2)
రక్షణ నిరీక్షణ తెచ్చాడయ్యా స్వస్ధత భద్రత ఇచ్చాడయ్యా (2)
లోకాన్ని ప్రేమించే ప్రేమికుడు దివినుండి దిగివచ్చాడు
మన పాపాన్ని పారద్రోలే పరిశుద్ధుడు పరమాత్ముడైన దేవుడు
1) చెరలో ఉన్నవారికి విడుదలనిచ్చుటకు బంధకములోఉన్న వారికి విముక్తుని ప్రకటించుటకు (2)
దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము భారభరిత హృదయమునకు స్తుతి వస్త్రమును (2)
దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము రక్షణ నిరీక్షణ తెచ్చాడయ్యా స్వస్ధత భద్రత ఇచ్చాడయ్యా (2)
లోకాన్ని ప్రేమించే ప్రేమికుడు దివినుండి దిగివచ్చాడు
మన పాపాన్ని పారద్రోలే పరిశుద్ధుడు పరమాత్ముడైన దేవుడు
2) పరమునుండి దిగివచ్చిన జీవాహారము యేసు పరమునుండి దిగివచ్చిన జీవాజలము యేసు (2)
లోకమునకు వెలుగుగా వచ్చిన యేసు ప్రతి మనిషిని తన వెలుగుతో నింపినాడు (2)
పరమ జీవము మనకు ఇచ్చినాడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)
లోకాన్ని ప్రేమించే ప్రేమికుడు దివినుండి దిగివచ్చాడు
పాపాన్ని పారద్రోలే పరిశుద్ధుడు పరమాత్ముడైన దేవుడు