Dhinadhinam Ninu Koniyada Lyrics

Lyrics in Telugu

దినదినం నిను కొనియాడ
అనుక్షణం నిను స్మరియింప
నా భాగ్యమే ప్రభువా ఇలలో

మాటలన్నీ మౌనమాయేనే
భావాలన్నీ పాటలాయెనే
రాగాలంటూ రాని గొంతులో
పల్లవులే ప్రవహించెనే
బ్రతుకే స్తుతిగా
పరమే దిశగా
కనివిని ఎరుగని కరుణను తలచుచు
నిను ప్రణుతించెదను
పనినిస సరిగరిస
సరిగరిస నినిసరిసని
దదసపా

సా సరిగరిస
సరిగరిస నినిసరిసని
దదసపా

నా పైన నీకున్న కృప ఎంత ఉందని
కొలవాలని నేను యోచించగా
ఆ నీలిగగనాలే ఎంతో ఎంతో ఉన్నతమే
ఇంకా ఇంక నీ కృప మహా ఉన్నతం
మాటలన్ని చాలవాయే
భాషలన్నీ తేలిపోయే
వేయినోళ్ళు ఏకమైనా
నీ ప్రేమను వర్ణించలేవే
కరగని తరగని కృపలను తలచుచు నిను భజియించెదను


నీ దివ్యసన్నిధిలో నీ ప్రేమవర్షములో
తడవాలని నేను ఆశించగా
నా ఊహను మించి నీ ప్రేమను పంచి
నా ధుఖమంతటిని తీర్చావుగా
చాలదయ్యా ఈ జీవితము
లోకమంతా నిన్ను చాటగను
శ్వాశ నాలో ఉండగనే
ఊరువాడ నిన్ను చాటెదను
మరువని విడువని కనికరుడవు అని నిను ఘనపరచెదను

We will be happy to hear your thoughts

      Leave a reply