Dhanam Balam – మూడునాళ్ళ ఈ ముచ్చట కోసం
Dhanam Balam – మూడునాళ్ళ ఈ ముచ్చట కోసం
మూడునాళ్ళ ఈ ముచ్చట కోసం
మనిషికెందుకో ఇంత ఆరాటం
యుగయుగాలు నిలిచియుండు
ఆ పరలోకముకై ఒక్కసారి యోచించి
చూడు సోదరా…సోదరా…
ధనం బలం నీకుందని మురిసిపోకురా
రేపు నీది కాదని మరచిపోకురా
నా ఇష్టం నా లైఫ్ అని యోచించకురా
టేక్ ఇట్ ఈజీ పాలసీని వదిలివేయరా
క్రీస్తేసుని నమ్మి నీ మనసు మార్చుకో
అక్షయమగు పరలోకం స్వతంత్రించుకో (2)
నమ్మకురా నమ్మకురా హై టెక్నాలజీ లోకం లో మోసపోకురా
నమ్మకురా నమ్మకురా నమ్మి నమ్మి నీ బ్రతుకును అమ్ముకోకురా
నమ్మి నమ్మి నీ బ్రతుకును అమ్ముకోకురా
అయ్యో అయ్యాయో ఇది ఏమి లోకము
పాపానికి పరుగులెత్తే పాడు లోకము
అయ్యో అయ్యాయో ఇది ఏమి రోగము మందులతో నయము కానీ మాయ రోగము
మంచి కొరకు లేమినైనా అనుభవించరా
మంచి పేరు తరతరాల కీర్తి పెంచురా (2)
దుర్నీతిని ద్వేషించి మంచి మనసుతో
నీతి కొరకు బాధలను అధిగమించరా
క్రీస్తులో నీ జీవితాన్ని స్థిరము చేసుకో
అక్షయమగు పరలోకం స్వతంత్రించుకో
కీడు మాని మేలు చేయ పూనుకొనుమురా
ప్రేమతో నీ పొరుగు వాని ప్రేమించుమురా (2)
స్వార్ధముతో ద్వేషమును పెంచుకోకురా
దేహానికి గుండెపోటు తెచ్చుకోకురా
నీ పాపపు వ్యసనాలకు స్వస్తి చెప్పారా
పరిపూర్ణ సమర్పణతో ప్రభుని చేరరా