Deham cheelutunna – దేహం చీలుతున్నా
Deham cheelutunna – దేహం చీలుతున్నా
దేహం చీలుతున్నా..
దాహం వేస్తున్నా…
దారంతరక్థమైన….
ఆగలేదు ఎందుకు..
గాయం బాధిస్తున్నా
గమ్యం నేనంటు
గుండె నిండా నా పైనా ఇంత ప్రేమ ఎందుకు
కరుణ చూపే నీకు కఠోర శ్రమ ఇప్పుడు
కలిగింది నా వాలనే కాదనలేను
రమ్యమైన నీ మోముపై రవ్వంత జాలి లేక
పిడి గుద్దులు గుద్దిన పాపిని నేను
కనబడుతున్నది నీ త్యాగం
ప్రాణం పోతున్నా ఆపని ఆ బలియాగం ……. || 2||
ఎంతో ఆశగా చేసుకున్నావు నన్ను
అంతే అలుసుగా తీసివేసినాను నిన్ను దేవా……
నీ కంటి పాపలా చూసుకున్నావు నన్ను
నీ కన్నీటికి కారణము నేను
అందని ఆకాశమందు అందాల రాజువు
అక్కరకే రాను కదా అవనికి దిగి వచ్చితివా….. || 2||
యేసయ్యాయా……..
కనబడుతున్నది నీ త్యాగం
ప్రాణం పోతున్నా ఆపని ఆ బలి యాగం ….. || 2 ||
ఎన్నో మారులు క్షమియించినావు నన్ను
మారని నా బ్రతుకు సిలువ వేసింది నిన్ను
దేవా…….
ఎంతో ఓర్పుతో సహియించినావు నన్ను
ఈ లోక ఆశలతో నే మరచితి నిన్ను
నరకపు కూపములో నే వేదన పడలేనని
దేవా నీవే నరుడై బలియాగమైతివా
యేసయ్యా……
వినబడుతున్నది నీ ప్రేమ నినాదం
విడువను ఏడబాయనన్న చిరకాల వాగ్దానం ….. || 2||