Christmas Santhosam naa gunde song lyrics – క్రిస్మస్ సంతోషం నా గుండె నిండెను
Christmas Santhosam naa gunde song yrics – క్రిస్మస్ సంతోషం నా గుండె నిండెను
క్రిస్మస్ సంతోషం నా గుండె నిండెను
క్రిస్మస్ తరాలతో నా ఇల్లు నిండెను -2
ఊరు వాడంతా -3 సంబరాలు చేయగా
రారాజు రాకను లోకమంతా చాటెదాం
రండోయ్ రారండోయ్ రక్షకుడు పుట్టెను
రండోయ్ రారండోయ్ జగమంతా
చాటిదాం llక్రిస్మస్ ll..
తూర్పు దిక్కు నుండి చుక్క పుట్టెను
లోకరక్షకుని జాడ తెలిపెను
తూర్పు దిక్కున చుక్కను చూసెను
జ్ఞానులంతా కలిసి యేసుని చేరెను *2
తూర్పు దిక్కు నుండి దూత వెళ్లెను లోకమంతా క్రీస్తు వార్త తెలిపెను
తూర్పు దిక్కున గొల్లలంతా చేరెను
రారాజు పుట్టెనని లోకానికి చాటెను llఊరుll
రాజుల రాజుగా యేసు పుట్టెను
లోక పాపమంతా తుడిచి వేసెను
రాజుల రాజుగా క్రీస్తు పుట్టెను
లోకమంతటికి రక్షణ తెచ్చెను *2
రాజుల రాజు మాట పలికెను
బంధకాల నుండి విడుదల కలిగిను
రాజుల రాజు ప్రేమ చూపెను
దిక్కులేని వారికి దారి చూపెను ll ఊరు ll
Happy Christmas