BETHLEHEMU PURAMULO-బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి

Deal Score+2
Deal Score+2

Lyrics:
బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి
ఊహలకు అందని అద్భుతము జరిగెను
లోక చరిత మార్చిన దైవకార్యము
కన్యమరియ గర్భమందు శిశువు పుట్టెను
అహహ్హ ఆశ్చర్యము ఓహోహో ఆనందము
రారాజు యేసు క్రీస్తు ని జననము
అహహ్హ ఏమా దృశ్యము ఓహొహ్హో ఆ మహత్యము
సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము

ధన్యులం హీనులం మనము ధన్యులం
దైవమే మనల కోరి దరికి చేరెను
మనిషిగా మన మధ్య చేరే దీన జన్మతో
పశువుల తోట్టెలోన నిదుర చేసెను
అంటు బాల యేసుని చూడ వచ్చి గొల్లలు
మనకు శిశువు పుట్టెనంటూ పరవశించిపోయిరి

పుట్టెను యూదులకు రాజు పుట్టెను
వెతికిరి ఆ రాజు జాడ కొరకు వెతికిరి
నడిపెను ఆకశాన తార కనపడి
నిలిచెను యేసు ఉన్న చోటు తెలుపెను
తడవు చేయకొచ్చిరి తూర్పు దేశ జ్ఞానులు
యేసు చెంత మొకరించి కానుకలర్పించిరి

దొరికెను రక్షకుడు మనకు దొరికెను
తోడుగా ఇమ్మనియేలు మనకు దొరికెను
దేవుని ప్రేమయే ప్రత్యక్షమాయెను
యేసుని రూపమే మనకు సాక్షము
యేసు జన్మ నింపేను లోకమంతా సంబరం
నింపెను నిరీక్షణ కృపయు సమాధానము

christians
We will be happy to hear your thoughts

      Leave a reply

      Tamil Christians songs book
      Logo