Athi Parisudhudu song lyrics – పరిశుద్ధుడు అతిపరిశుద్ధుడు నన్ను
Athi Parisudhudu song lyrics – పరిశుద్ధుడు అతిపరిశుద్ధుడు నన్ను
పల్లవి : పరిశుద్ధుడు అతిపరిశుద్ధుడు నన్ను నడుపుచున్న నా గొప్ప దేవుడు
అ.ప. ఆరాధన యేసయ్యకే – నా స్తుతికి పాత్రుడు తానే
||పరిశుద్ధుడు||
1. నా యుద్ధములో ఆత్మ ఖడ్గమై అపవాది తంత్రముపై జయము నిచ్చాడు
తన చిత్తమును నే నెరవేర్చుటకు సర్వాంగ కవచమే ధరియింప జేసాడు
||ఆరాధన||
2. నా వేదనలో అండగ నిలిచి మరణభయము లేకుండ తప్పించినాడు
నిందకు ప్రతిగా పూదండనే ఇచ్చి ఆనంద తైలముతో అభిషేక మిచ్చాడు
||ఆరాధన||
3. నా శ్రమయందు ఓర్పుతో నింపి నే కృంగి పోకుండా కాపాడుకున్నాడు
లోకమునుండి నన్ను విడిపించి పట్టుదలతో ప్రార్ధింప నేర్పించి యున్నాడు
||ఆరాధన||