Anthuchikkani Anavaluga Song lyrics – అంతుచిక్కని ఆనవాలుగా
Anthuchikkani Anavaluga Song lyrics – అంతుచిక్కని ఆనవాలుగా
అంతుచిక్కని ఆనవాలుగా మెరిసింది తార ఒకటి
మహా సంతోషకరమైన వార్తను తాను చాటి చెప్పిందిగా
ప్రజలందరికీ ఆ వార్త క్రీస్తు జననపు సువార్త
రారండి వేడండి యేసయ్య పుట్టాడు లోకాన్ని రక్షించగా
ఊరువాడ సందడి చేయ యేసయ్య పుట్టాడు జగమంతా పండుగ
ఆశ్చర్యకరము ఆనందమయము సంతోష మహా సంబరం
రారండి వేడండి యేసయ్య పుట్టాడు లోకాన్ని రక్షించగా
ఊరువాడ సందడి చేయ యేసయ్య పుట్టాడు జగమంతా పండుగ
పరలోక రాజా బాల యేసు
పరమును వీడి భువికొచ్చి
లోకరక్షకుడై లోకపాలకుడై
ఉదయించినాడు సంతోషమే మహా ఆనందమే
- పాపులనే రక్షించగా వచ్చాడంట రారాజంట దీనునిగా లోకానికి
పామరుడై వచ్చాడంట సమాధానం ఇచ్చుటకు లోకాన్ని కాపాడుటకు
సర్వభూమి పాలించుటకు దేవదేవుడే ఇల దిగినాడు
సత్య వార్తను ప్రకటించుటకు మానవ రూపం దాల్చినాడు
ఈ వార్తను ప్రకటించుటకు మనమంతా పోదాము || రారండి || - దేవదూత వార్త చెప్పగా సంతోషంగా ఆనందంగా కాపరులు వచ్చారంట
కనులార చూసినాడట గుండెల్లోనా ఉల్లాసంగా ప్రేమతో చూశారంటా
తార వెంట జ్ఞానులంట చేరినారు యేసు చెంతకు
బంగారు భోళం సాంబ్రాణి అర్పించారు దేవా దేవుని కొలిచినారు
ఈ వార్తను ప్రకటించుటకు మనమంతా పోదాము || రారండి ||