Agadha Jala Pravahame Song Lyrics – అగాధ జల ప్రవాహమే ఆర్పలేనిది

Deal Score0
Deal Score0

Agadha Jala Pravahame Song Lyrics – అగాధ జల ప్రవాహమే ఆర్పలేనిది

అగాధ జల ప్రవాహమే ఆర్పలేనిది
అనంత మానవాళికే ఆనవాలివి
తరాలలో యుగాలలో కానరానిది
రెండక్షరాల మాటలో
ఎంత వింతగా ఇమిడింది (2)
దేవా అది నీ ప్రేమే

నాకంటే నన్నే ప్రేమించే
నీవంటి వారు లేరయ్యా
నీ కంటి పాపగా కాచే
ఆ ప్రేమ సాటి లేదయ్యా
నీకై నేనున్నానంటూ నిలిచావయ్యా
నీ వెలుగు పంచాలంటూ పిలిచావయ్యా (2)
నీ సాక్షి నేనంటూ నీ రాయబారినంటూ
ఈ జన్మకిది చాలంటూ

నేనున్నా నేనున్నా దేవా
నా శ్వాస నన్నొదిలి పోయేదాకా
నేనున్నా నేనున్నా దేవా
నీ చిత్తం నాలో నెరవేరేదాకా

1)బ్రతుకు పోరులో బలము చాలక
భ్రమలు ఆవరించిన వేళలో / వేళా
నా నీతి నా జ్ఞానం ఆధారం కాగా
అలసిపోయి నిలిచితి దేవా (2)

తప్పిపోయిన బిడ్డనుగా వున్నాననుచూ
తప్పే దిద్ది సరిచేయుము దేవా అనుచూ
వెన్ను చూపని బతుకిమ్మనుచూ

నేనున్నా నేనున్నా దేవా
నా శ్వాస నన్నొదిలి పోయేదాకా
నేనున్నా నేనున్నా దేవా
ఈ మజిలీ ఓ చోట ఆగేదాకా

2)ఎవని పంపెదన్ ఎవడు పోవునంటూ
పిలచిన ఆ పిలుపుకే బదులుగా
సిద్ధపడిన సైన్యమై సిగ్గుపడని సాక్షిగా
శుద్ధిచేసి నిలుపుము దేవా (2)

ఏ స్థితికైనా నువు నాకు చాలును అనుచూ
ఎందాకైనా నీతోనే సాగెదననుచూ
ఎన్నటికీ నే నీదానిని అనుచూ

నేనున్నా నేనున్నా దేవా
నే మన్నై నిన్నంటి పోయేదాకా
నేనున్నా నేనున్నా దేవా
ఈ మజిలీ ఓ చోట ఆగేదాకా

3)వ్యాధి బాధలో శోధనంచులో
నలిగి కరిగే దీన జీవితాలకై
నాథుడైన నీ ప్రేమను మాటలకే కాక
చేతలలో నింపుము దేవా (2)

నీకిష్టముగా నను చెక్కుము దేవా అనుచూ
నీ సన్నిధిలో నిరతం తల దించాననుచూ
నిన్ను చూసే కనులిమ్మనుచూ

నేనున్నా నేనున్నా దేవా
నా శ్వాస నన్నొదిలి పోయేదాకా
నేనున్నా నేనున్నా దేవా
ఈ కట్టె వట్టిదిగా మిగిలేదాకా

    Jeba
        Tamil Christians songs book
        Logo