అశీర్వాదపు వర్షం – Aasirvadhapu Varshamu Promise song lyrics
అశీర్వాదపు వర్షం – Aasirvadhapu Varshamu Promise song lyrics
ఆశీర్వాదపు జల్లులు కురిసే కాలమిదియేగా
ఆత్మ దేవుడు గాలై వీచగా వర్షమై కురియునే – 2
ఉన్నతస్థలి నుండి నీపై ఆత్మను కురిపించున్
ఎండియున్న నిన్ను యేసు మరల బ్రతికించున్ – 2
Chorus:
మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది
మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది – 2
1) నీ ముందును నీ వెనుక దీవెన కురిపించున్
వాడియున్న నీ బ్రతుకు ఫలములతో నింపున్ – 2
బీడుగా ఉన్న నీ నేలను ఫలభరితము చేయున్
నీ చేతుల పనియంతటిలో ఆశీర్వాదమునిచ్చున్ – 2
Chorus: మీ దుఃఖం సంతోషముగా…
2) అరణ్యము పొలమువలె మారే సమయమిది
ఎడారిలో సెలయేరు ప్రవహించే తరుణమిది – 2
స్వప్నములో దర్శనములలో యేసే కలుసుకొని
దీర్ఘదర్శిగా నిన్ను మార్చి తానే వ్యక్తమగున్ – 2
Chorus: మీ దుఃఖం సంతోషముగా…
మహావర్షము ఒకటి కురియున్
మన దేశము పైన కురియున్ – 2
ఆత్మదేవుడు వర్షమై కురియునే
మహావర్షము ఒకటి కురియున్
మన దేశము పైన కురియున్
ఆత్మదేవుడు వర్షమై కురియునే – 2
ఆశీర్వాదపు వర్షమై కురియునే