*తార వెలిసెను చూడు ఆకాశంలోన
రక్షణ పుట్టెను నేడు క్రిస్మస్ కాంతిలోన
మహా అద్భుతము జరిగెను ఈ భువిలోనా
వినిపించెను సువర్తమానము ఈ ప్రపంచానా
Happy Happy Christmas……
Merry Merry Christmas……
సంతోషంతో ఆనందంతో
ప్రభువుని పూజించుదాం ఆరాధించుదాం
అందరు రండీ సందడి చేద్దాం….
1.బెత్లెహేము పురములో – ఆ పశువుల పాకలో
రాజుల రాజు ప్రభువుల ప్రభువు ఉదయించెను మన కోసము(2)
సర్వపాప పరిహార్ధమగుటకు పాపులను రక్షించుటకు పుట్టినాడని తెలిపింది ఆ గొప్ప మహతార.(2)
2.గొల్లలు జ్ఞానులు వచ్చిరి – ప్రభువును పూజించిరి
బంగారు సాంబ్రాణి భోళముతో ఆరాధించిరి(2)
మహిమ వెలుగుతో బాల యేసుడు పరుండియుండుట చూచిరి – ఎంత ధన్యత చేసుకొంటిరో ఆ గొల్లలు జ్ఞానులు(2)