సాటి లేనిది యేసుని రక్తము – Saatilenidi Yesuni Rakhtamu
సాటి లేనిది యేసుని రక్తము – Saatilenidi Yesuni Rakhtamu Telugu Christian song lyrics in English. Songs Of Zion.
సాటిలేనిది యేసుని రక్తము
సాటిలేనిది యేసుని రక్తము
పాపమును కడుగును ప్రియుడా
పాపమునే కడుగును
1.చూడుము సోదరా దేవుడు ఎంతో
ప్రేమించె నీ జగతిన్ ప్రియుడా
ప్రేమించె నీ జగతిన్
సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు
యేసుని పంపెను ప్రియుడా
యేసుని పంపెను – ||సాటి||
2.లోకమున కరుదెంచి క్రీస్తు ప్రభువు
ప్రాణము బలిగా నిచ్చె ప్రియుడా
ప్రాణము బలిగా నిచ్చె
లోక పాపమెల్ల సిలువలో మోసి
తొలగించె శాపముల్ ప్రియుడా
తొలగించె శాపముల్ – ||సాటి||
3.వినుము సోదరా ప్రభు యేసు క్రీస్తుని
పరలోక వార్తను ప్రియుడా
పరలోక వార్తను
ఉన్నతమైన పరలోక ప్రేమను
చాటించుచుంటిమి ప్రియుడా
చాటించు చుంటిమి – ||సాటి||
4.యేసుని నీవు క్షమించుమనివేడు
విరిగిన హృదయముతో ప్రియుడా
విరిగిన హృదయముతో
యేసుని అమూల్యరక్తధారలే
కడుగును పాపమెల్ల ప్రియుడా
కడుగును పాపమెల్ల – ||సాటి||
5.పాప భారమును మోసికొని నీవు
ప్రయాస మొందెదవా ప్రియుడా
ప్రయాస మొందెదవా
పాపమొప్పుకొని యేసు పాదముల
చెంతకు చేరుమా ప్రియుడా
చెంతకు చేరుమా – ||సాటి||
6.గతించుచున్నది స్వల్ప జీవితము
శీఘ్రముగా రమ్ము ప్రియుడా
శీఘ్రముగా రమ్ము
కర్త యేసు నందు విశ్వాసముంచి
రక్షణ పొందుము ప్రియుడా
రక్షణ పొందుము – ||సాటి||
- కృప, ఆనందము, పవిత్ర ప్రేమలో
భాగము పొందుము ప్రియుడా
భాగము పొందుము
పాప సాగరము దాటించగలడు
యేసు రక్షకుడే ప్రియుడా
యేసు రక్షకుడే – ||సాటి||
సాటి లేనిది యేసుని రక్తము – Saatilenidi Yesuni Rakhtamu Songs of Zion songs Telugu Christian Old Melody
Singer :- Surya Prakash Injarapu