Anadhaga Cheyani Pradhana – Telugu Prayer song lyrics
Anadhaga Cheyani Pradhana – Telugu Prayer song lyrics
(పల్లవి)
కన్నులెత్తి చూచెద
కరములెత్తి వేడెద
కూర్చుండి కోరేదా
కృపాసనమును చేరదా
( అనుపల్లవి)
ప్రార్ధన ప్రార్ధన తండ్రికే ప్రార్ధన
అనాధగా నను చేయని ఆపదలో ప్రార్ధన
ప్రార్థన ప్రార్థన యేసయ్యకే ప్రార్ధన
ఆరోగ్యము ఐశ్వర్యము ఇచ్చేది ప్రార్థన
ప్రార్ధన ప్రార్ధన ఆత్మలో ప్రార్ధన
అభిషేకము అధికారముతో నింపేది ప్రార్ధన
1.ఒంటె మోకాళ్ళతో ఒంటరిగా ప్రార్థన
ఓర్పు లేని సమయంలో
ఓడిపోదే ప్రార్థన (2)
ఒత్తిడైన వేళలో ఓదార్చే ప్రార్థన
ఒడ్డు చేరలేని నావలో ఒక్కటైన ప్రార్థన
ప్రార్థనా ప్రార్ధన…….
కన్నులెత్తి చూచెద……
2.వంచిన ముఖముతో వేదనతో ప్రార్ధన
వేధించిన విషయములో
వాడిపోదే ప్రార్థన
వెక్కిరించిన వార్తలను వ్యర్థపరిచే ప్రార్ధన
వెలివేసిన వేళలో వెలకట్టే ప్రార్ధన
ప్రార్ధన ప్రార్థన…..
కన్నులెత్తి చూచెద