Rakshana Sunadhamu Christmas song lyrics – రక్షణ సునాదము
Rakshana Sunadhamu Christmas song lyrics – రక్షణ సునాదము
పల్లవి:
కాలము పరపూర్ణమైనప్పుడు
దేవుడు తన కుమారుని పంపెను
రూపము లేని ఆ దేవుడు
నర రూపాన క్షితిని అవతరించెనే
Pre Chorus:
యేసే రక్షణ క్షేమ సునాదము
క్రీస్తే ముక్తికి మహిమ మార్గము
నరుని ఆత్మకు మహిమ స్వరూపము
క్రిస్మస్ సంతోషమే
Chorus:
సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ
భువి మీద మనుజాలికి సమాధానము
క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయ హల్లెలూయ
మహిమ ప్రభావము దేవునికే చెల్లును
సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ
భువి మీద మనుజాలికి సమాధానము
క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయ హల్లెలూయ
ఉత్సాహ ధ్వనులతో ఆర్భాటించెదన్
చరణం 1:
నిత్య దేవుండు – వసుధకు రాగోరే
కన్య గర్భాన – అవతరించెనే
నిఖిల ధర్మములు – నరులకు బోధించి
సత్య మార్గమున నడిపించేనే
పాపులను క్షమించి – మృతులను బ్రతికించి
ఆత్మకు శాంతిని – నెమ్మదినిచ్చేనె
మ్రాను పై వ్రేలాడి – లేని నేరము కై
శిక్షను భరియించి – మరణమొందెనే
సాతాను శిరస్సును – ఛేదన చేసి
మరణపు సంకెళ్ళు త్రుంచివేసి జయమిచ్చి
పాప భారము వ్యాధి బాధలు
ఉగ్రత తొలగించెనే. ||సర్వోన్నత
చరణం 2:
యేసుని నామమున – ఏమి అడిగినను
చేసేదనని మనకు – అభయమిచ్చెనే
మోక్షమునకు చేరి – తన ఆత్మను పంపి
నిన్నాకర్షించుటకు రానుండేనే
మధ్యాకాశమున – యేసుని కలసికొని
మహిమలో చేరి – జీవించుము
తన సింహాసనము – అక్షయ కిరీటము
ధవళ వస్త్రములు – ధరియించుము
సర్వాధికారియు దేవుడునగు ప్రభువు
ఏడు ఆత్మలతో ప్రజ్వలించి ప్రకాశించి
మహిమ విందును శాంతి పాలనను
పరలోక రాజ్యామిచ్చును. ||సర్వోన్నత||