సజీవుడవు సహయుడవు – Sajeevudavu sahayudavu
Deal Score0
Shop Now: Bible, songs & etc
సజీవుడవు సహయుడవు – Sajeevudavu sahayudavu
పల్లవి:
సజీవుడవు సహయుడవు-అజేయుడవు అసమానుడవు “2”
జీవాహరము నీవే మా ప్రాణాధారము నీవే
యేసయ్యా జీవాహరము నీవే మా ప్రాణాధారము నీవే.
- మార్గము నీవని సత్యము నీవని జీవము నీవని తెలిపిన దేవా “2”
నీ మార్గమున నన్ను నడుపుము దేవా-సత్యవంతునిగా మార్చుము ప్రభువా
నీ నిత్యజీవమును నాకొసగు తండ్రి. “సజీవుడవు” - సిలువలో నాకై రక్తము కార్చి-కలువరి త్యాగము చేసిన దేవా “2”
నీ రక్తమే నాకు రక్షణ దేవా-నీ మాటలే నాకు జీవము ప్రభువా “2”
నీ త్యాగమెన్నటికి మరువనిది తండ్రి. “సజీవుడవు” - మరణపు ముల్లును విరిచి నీవు-మరల తిరిగి లేచిన దేవా “2”
జయగీతమే నేను పాడేదను దేవా – జీవాధిపతివని పొగెడదను ప్రభువా
పునారుత్తానుడవు నీవే యేసయ్యా… “సజీవుడవు”