అయ్యో నేను అపవిత్రమైన – Ayyo Nenu Apavitramaina
అయ్యో నేను అపవిత్రమైన – Ayyo Nenu Apavitramaina
పల్లవి : అయ్యో నేను అపవిత్రమైన వాడనైతిని యేసయ్య
అయ్యో వ్యర్థముగా నడుచుకుంటిని యేసయ్య
నీ మాటకి లోబడక తిరిగియుంటిని యేసయ్య
ఒంటరి గువ్వ వలె తిరుగుచుంటిని యేసయ్య “అయ్యో నేను”
1 కన్నులతో చూచినది నా హృదయము కోరినది
దేనిని నేను అభ్యంతర పరచలేదుగా “2”
సూర్యుని కింద జరుగుచున్నదాంతయు
వ్యర్థముగా కనబడునుచున్నది “2” “వ్యర్థముగా”
2 ఈ లోకపు ఆశలకు నేను దాసుడనైతిని
నీ ప్రేమను మరచి నేను దోషుడనైతిని “2”
చల్లగా నైనా వెచ్చగా నైనా ఉండక
నులి వెచ్చని స్థితిలో నేను ఉన్నను యేసయ్య “2” “అయ్యో నేను”
3 రక్షణ కరమైన తోటలో నన్ను కాయుచున్నా దేవా
కరుణ తో నన్ను కాపాడిన దేవా
నీ రక్తముతో నన్ను కడిగియున్న దేవా
బాహువటముగా సిలువ వేసిన వాడను “అయ్యో నేను”
4 కనులేత్తి నేను చూడగా నా వలె ఎందరో
చీకటి ఊబిలో తిరుగుచూ ఉంటిరి
ఈ ఒక్కసారి వెలిగించవా ప్రభువా
నీ మాట పాటగా వెలిగించవా ప్రభువా. “అయ్యో నేను”
Rakshana Kartha Latest Christian Telugu Song