కంటి రెప్పలా నను – Kanti Reppala
కంటి రెప్పలా నను – Kanti Reppala
కంటి రెప్పలా నను కాయుచున్న దేవా
అన్ని వేళలా కాపాడుచున్న దేవ
నను కాచిన కాపాడిన యేసయ్య… వందనం
వందనం వందనం యేసయ్య వందనం
వందనం వందనం యేసయ్య వందనం…
నా ప్రాణమునకు నెమ్మది నిచ్చావు
నా ప్రార్థనలను ఆలకించుచున్నావు
కృపా క్షేమమును దయచేయుచున్నావు
కునుకక నిత్యము కాపాడుచున్నావు
నా స్థానములో మరణించినావు
నీ కౌగిలిలో దాచిఉంచావు
ఊహకుమించి ఆశీర్వదించావు
నీ సన్నిధిలో నిలబెట్టుకున్నావు