నీ దివ్య కృపామృతం – Nee Divya Krupamrutham
నీ దివ్య కృపామృతం – Nee Divya Krupamrutham
పల్లవి
కురిసెను నాలో నా యేసయ్యా
నీ దివ్య కృపామృతం (2)
మధురాతి మధురం నీ నామగానం
నీవే నా సంగీతం (2)
ఏరీతి పాడను – నీ ఉన్నత ప్రేమను (2)
1. నావారే నన్ను నిందించినను నీతో నేనున్నా నన్నావు
పరుల మాటలు కృంగదీసినను స్నేహించి నను ఓదార్చావు
పరిమితిలేని ప్రేమను పంచి విడువక తోడై నిలిచావు (2)
ఎన్నడు మారని నిజ ప్రేమది నీ కృపకు సాటియేది (2)
2. ఏమంచిలేని నన్నెన్నుకున్నావు నీవే నా జీవదాతవు
నా ఊహకందని నీ సేవనిచ్చావు నీవే నా జతగా నిలిచావు
నీవిచ్చినదే ఈ స్వర సంపద నీ నామం ప్రకటించెద (2)
నిను చేరే వరకు నీ సాక్షిగా బలమైన నీ పాత్రగా (2)