Kaluvari Siluvalo song lyrics – కలువరి శిలువలో విలువగు రుధిరము

Deal Score+1
Deal Score+1

Kaluvari Siluvalo song lyrics – కలువరి శిలువలో విలువగు రుధిరము

ప) కలువరి శిలువలో విలువగు రుధిరము
మాకై కార్చిన పరిశుద్దుడా పావనుడా

పరమ తండ్రి తనయుడా పాపరహితుడా – ప్రాణసఖుడా
పాపులమైన మా కొఱకు ప్రాణమిచ్చిన పరమాత్ముడా

ఎంతటి ప్రేమ ఎంతటి జాలి
నీకెంతటి కరుణ యేసయ్యా

నేనెన్నగ తరమా నా ప్రభువా
నిన్నెన్నగ తరమా నా ప్రభువా

1) కలుషాత్ములమై కఠినముగా నిన్ను
కొరడాలతో కొట్టితిమి
ఉన్మాదుల వలె నీ ముఖారవిందమును
మలినము జేయ ఉమ్మితిమి -2

పాపపంకిలపు బల్లెపు పోట్లు
నీ ప్రక్కలోన పొడిచితిమి

పెదవి విప్పవైతివి బదులు పలుకవైతివి
మౌనివై నిను జంపు వైరిని మన్నించితివి

ఎంతటి ప్రేమ ఎంతటి జాలి
నీకెంతటి కరుణ యేసయ్యా

నేనెన్నగ తరమా నా ప్రభువా
నిన్నెన్నగ తరమా నా ప్రభువా

2) మిక్కుటమైన మా అతిక్రమములు
నీ తలపైనా ముళ్లకిరీటమాయెనా
దుర్మార్గుల వలె నీ కాలుసేతులలో
మేకులను కొట్టితిమి – 2

అపహాస్యములు అవమానములు
నీవేలా సహించి భరియించితివో

పెదవి విప్పవైతివి బదులు పలుకవైతివి
మౌనివై నిను జంపు వైరిని మన్నించితివి

ఎంతటి ప్రేమ ఎంతటి జాలి
నీకెంతటి కరుణ యేసయ్యా

నేనెన్నగ తరమా నా ప్రభువా
నిన్నెన్నగ తరమా నా ప్రభువా

ప) కలువరి శిలువలో విలువగు రుధిరము
మాకై కార్చిన పరిశుద్దుడా పావనుడా

పరమ తండ్రి తనయుడా పాపరహితుడా – ప్రాణసఖుడా
పాపులమైన మా కొఱకు ప్రాణమిచ్చిన పరమాత్ముడా

ఎంతటి ప్రేమ ఎంతటి జాలి
నీకెంతటి కరుణ యేసయ్యా

నేనెన్నగ తరమా నా ప్రభువా
నిన్నెన్నగ తరమా నా ప్రభువా

కలువరి శిలువలో విలువగు రుధిరము
మాకై కార్చిన పరిశుద్దుడా పావనుడా

Jeba
      Tamil Christians songs book
      Logo