యేసు నీ చెంత – Yesu ne chentha

Deal Score0
Deal Score0

యేసు నీ చెంత – Yesu ne chentha

పల్లవి : యేసుని చెంత నీ చింత పోవును
నీ హృదయమంతా నింపుకో యేసుని (2)
అ.ప : సాధ్యం సాధ్యం యేసులో సాధ్యం
సాధ్యం సాధ్యం సమస్తము సాధ్యం (2)
(యేసుని )

1) యాయీరు కూతురు మరణించినను
యేసుని నమ్మినందున జీవించి నడుచెను (2)
నమ్మి చూడు యేసుని నిత్య జీవమిచ్చును (2)
( సాధ్యం )

2. పన్నెండేండ్ల రోగముతో బాధపడిన స్త్రీ
యేసుని విశ్వసించి విడుదల పొందెను (2)
విశ్వసించు యేసుని విమోచన నిచ్చును (2)
( సాధ్యం )

3. ఆకాశ పక్షులను పోషించే దేవుడు
నీ చింత యావత్తు తీర్చును ఎల్లపుడు (2)
నమ్మి చూడు యేసుని మేలులెన్నో చేయును (2)
( సాధ్యం )

Jeba
      Tamil Christians songs book
      Logo