నీలోనే లభించింది జీవం – Neelone labhinchindhi jeevam
నీలోనే లభించింది జీవం – Neelone labhinchindhi jeevam
ప. నీలోనే లభించింది జీవం
నీతోనే వరించింది స్నేహం
నాకే ఏల ఈ గొప్ప సౌభాగ్యం
నాకై పెట్టితివి ప్రాణం
నను ఆకర్షించెను నీ త్యాగం
నీవే నే చేరాల్సిన గమ్యం
ప్రాణానికి ప్రాణం
అ.ప.: యేసయ్యా నీకంకితం
నీ మహిమార్థం ఇచ్చిన జీవితం
1. నాకేరూపు లేనప్పుడు
నను నీవే చూసియున్నావుగా
ఊహే నాకు రానప్పుడు
నీవు నన్నే కోరుకున్నావుగా
నీకే స్తుతిగీతం
నీకోసం సంగీతం
2. ప్రేమించావు అమితంబుగా
నను నీ రాజ్యాన సమకూర్చగా
హెచ్చించావు అధికంబుగా
ఘన సంకల్పాన్ని నెరవేర్చగా
నీవే నా శరణం
నీతోనే నా విజయం
3. నైపుణ్యాన్ని నేర్పించుచు
సరిచేస్తున్నావు క్రమక్రమముగా
సామర్ధ్యాన్ని అందించుచు
బలమిస్తున్నావు స్థిరపరచగా
నీతో సహవాసం
అభివృద్ధికి సోపానం