నా యెడల నీవు చేసిన మేలులను వర్ణింపలేను – Na Yendala Nivu Cesina
నా యెడల నీవు చేసిన మేలులను వర్ణింపలేను – Na Yendala Nivu Cesina
నా యెడల నీవు చేసిన మేలులను వర్ణింపలేను – వివరింపలేను మరువలేనయ్యా నీ మధురప్రేమను విడువలేనయ్యా నీ సన్నిధానమును
అ.ప.: హల్లెలూయా
హోసన్నా హల్లెలూయా
ఆరాధన
స్తుతి ఆరాధన
1. శ్రమల సంకెళ్లు నన్ను
పట్టి బంధించినా
సాయపడువారు లేక
కృంగియున్న సమయాన
నీ గొప్ప వాత్సల్యం నా పైన చూపించి
కీడు నుండి తప్పించి
మేలులతో నింపితివి
2. మరణ పాశాలు నన్ను
చుట్టి బాధించినా
వేదనకు తాళలేక
సోలియున్న సమయాన
నీ శక్తి సామర్థ్యం నాలోకి పంపించి సేవలోన తరియించే
భాగ్యమును ఇచ్చితివి.